- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారి వల్ల మనసుకు తగిలిన గాయాలు.. ఎంత ఏడ్చినా లాభం లేదంటూ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ‘బద్రి’ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈయన.. బాక్సాఫీస్‌కు అనేక మంచి హిట్‌లను ఇచ్చాడు. ఇక ఇటీవల వచ్చిన ‘లైగర్’ చిత్రంతో డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం రామ్‌తో ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కించే పనిలో పడ్డాడు పూరి. 2019 లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మన డైరెక్టర్. ఇదిలా ఉంటే ఆయనకు ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో ఉన్న ఇందులో అనేక అంశాలపై తన అభిప్రాయాలను చెబుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో జీవితంలో ఎదురయ్యే దెబ్బలు, వాటిని ఎదుర్కొనే పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు.
‘తన్నుకుని పడ్డాం దెబ్బతగిలింది. ఒక్కోసారి కాళ్లు చేతులు ఇరగొచ్చు. మరికొన్ని సార్లు హెడ్ ఇంజురీ కావచ్చు. ఏం జరిగిన మన బాడీ దానిని తగ్గించే పనిలో పడుతుంది. కొన్ని దెబ్బలు తగ్గడానికి సమయం పడుతుంది.. కానీ, గాయమైతే తగ్గిపోతుంది. అలాగే ఒక్కోసారి మన గుండెకు దెబ్బ తగులుతుంది. కన్నతండ్రి చనిపోవచ్చు, కష్టానికి ప్రతిఫలం దక్కకపోవచ్చు, నమ్మినవాళ్లు మోసం చేయొచ్చు. వీటివల్ల మనసుకు తగిలిన గాయాన్ని మనమే నయం చేసుకోవాలి. అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఏం జరిగినా.. ఎంత అనర్థం వచ్చిన హీలింగ్ (బయటపడటం) టైమ్ ఎక్కువ పెట్టుకోకూడదు. మానసికంగా దృఢంగా ఉండాలి. రోజులు తరబడి ఏడుస్తూ ఉండకూడదు. ఎంత ఏడ్చినా ఉపయోగం లేనప్పుడు.. జరిగిన నష్టం భర్తీ కానప్పుడు ఎందుకు ఏడవాలి? వీలైనంత త్వరగా అందులోనుంచి బయటకు వచ్చేయ్. పక్కవాళ్ల ఓదార్పు కోసం ఎప్పుడు ఎదురు చూడకు. మనల్ని ఎవరూ ఓదార్చకూడదు. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి.
కష్టం వచ్చినప్పుడు బాగా ఏడవండి?. కానీ, వెంటనే పనిలో పడండి. ప్రేమలో విఫలమైన కొందరు మద్యానికి బానిస అవుతారు.. సూసైడ్ చేసుకుంటారు. దయచేసి అలా చేయకండి. అది చాలా పిచ్చి పని. ఎంత ఫెయిల్యూర్ వచ్చినా.. తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ఎంత కష్టం వచ్చినా ఒత్తిడిగా బావించొద్దు. అన్నం తినడం మానొద్దు. నీళ్లు తాగడం ఆపొద్దు. కావాల్సినంత నిద్ర పోవాలి. మన శరీరం కోరుకునే కనీస అవసరాలు తీర్చాలి. అలా చేస్తేనే వీలైనంత త్వరగా కోలుకుంటాం. ఏం జరిగినా నెక్ట్ ఏం చెయ్యాలో ఆలోచించూ. నువ్వు చనిపోతున్నావని గంట ముందు తెలిసినా.. తర్వాత ఏం చేయాలి అనుకుంటావో చేసేయ్. ఇవన్నీ మనం బతికి ఉండడం వల్ల వచ్చిన సమస్యలు. ఊపిరి ఉండేంత వరకు వీటిని ఫేస్ చేయాల్సిందే. ఎవరికి వారే నచ్చజెప్పుకోవాలి. ఏం జరిగిన ఆ బాధ నుంచి తొందరగా బయటపడాలి. అలా బయట పడగలిగే వాడే అందరికంటే గొపోడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Read More...
స్టార్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం..