కన్నీళ్లతోనే ప్రియాంక నటనా జీవితం మొదలైంది.. అసలు విషయం భయటపెట్టిన తల్లి

by sudharani |   ( Updated:2023-07-08 11:23:23.0  )
కన్నీళ్లతోనే ప్రియాంక నటనా జీవితం మొదలైంది.. అసలు విషయం భయటపెట్టిన తల్లి
X

దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కెరీర్ టర్నింగ్ పాయింట్ గురించి తల్లి మధు చోప్రా ఆసక్తికర విషయం బయటపెట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ప్రియాంక నటనా జీవితం కన్నీళ్లతోనే మొదలైందని, దానికి కారణం తానే అని మధు చోప్రా వెల్లడించింది. ‘నిజానికి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న తర్వాత నా కూతురు ఉన్నత చదువులు చదువుకోవాలని కోరుకుంది. కానీ కనీసం ఒక్క సినిమాలోనైనా నటించమని నేను పదే పదే అడిగాను. చివరికి బలవంతంగా ఒప్పించాను. ఆమె సంతకం చేసిన మొదటి సినిమా ఒప్పంద పత్రంపై ప్రియాంక కన్నీటి చుక్కలున్నాయి. ‘నువ్వు చెప్పటం వల్లే నేను ఈ పని చేస్తున్నాను’ అని ఆ రోజు ఏడుస్తూ నాకు చెప్పింది’ అంటూ వివరించింది పీసీ మదర్ మధు చోప్రా.

Read More..

మా అమ్మ నాతో గడిపిన చివరి క్షణాలు ఇవే : జాన్వీ

డివోర్స్ తీసుకున్న బాధ లేకుండా.. శ్రీజ కుమార్తే బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేసిన నిహారిక!

Advertisement

Next Story