భర్తతో గొడవలపై మొదటిసారి నోరువిప్పిన ప్రియమణి ఆసక్తికర కామెంట్స్ వైరల్!

by Hamsa |   ( Updated:2024-02-15 10:32:07.0  )
భర్తతో గొడవలపై మొదటిసారి నోరువిప్పిన ప్రియమణి ఆసక్తికర కామెంట్స్ వైరల్!
X

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అప్పట్లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంది. పలు టీవీ షోస్‌లో జడ్జీగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత 2023లో నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాతో ప్రియమణి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రియమణి నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘భామా కలాపం-2’ ఇది ఫిబ్రవరి 16 నుంచి ప్రముఖ ఓటీటీలో సంస్థ ఆహాలో విడుదల కానుంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తన భర్తతో జరిగే గొడవల పై స్పందించింది. భామా కలాపంలో గ్యాంగ్స్‌ని అల్లాడించే వైలెంట్ పాత్రలో నటించిన ప్రియమణి నిజ జీవితంలో భర్తను భయపెడుతుందా? తానే భయపడుతుందా? అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి ఆమె స్పందిస్తూ.. ‘‘ నేను భర్తకు భయపడతాను, అదే సమయంలో భయపెడతాను కూడా. అంటే వైలెన్స్ అని కాదు. కొన్ని సందర్భాల్లో భర్త మన మాట వినాలి, మనం కొన్నిసార్లు వాళ్ళ మాట వినాలి. ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట. అయినా భార్య భర్త అన్నాక గొడవలు సాధారణం’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియమణి కామెంట్స్ వైరల్ అవుతుండగా ఈ విషయం తెలిసిన వారు అంతే అలా ఉంటేనే బంధం బలంగా ఉంటుందని అంటున్నారు.

Advertisement

Next Story