నితిన్ కాళ్లు మొక్కిన హీరోయిన్ Pranitha Subhash.. నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్

by Anjali |   ( Updated:2023-07-17 14:41:30.0  )
నితిన్ కాళ్లు మొక్కిన హీరోయిన్ Pranitha Subhash.. నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్ ప్రణీత. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కన్నడ, మలయాళ చిత్రాల్లో అలరిస్తోంది. అయితే ప్రణీత 2021లో కుటుంబ సభ్యుల సమక్షంలో వ్యాపారవేత్తైన నితిన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక పాప జన్మించింది. తరచూ సోషల్ మీడియాలో కుమార్తె పిక్స్ షేర్ చేస్తూ ఈ హీరోయిన్ తెగ మురిసిపోతూ ఉంటుంది. కాగా కర్ణాటకలో భీమన అమావాస్య పండగ రోజు భార్యలు, భర్తల పాదాలనూ తాకుతూ ఆశీర్వాదం తీసుకుంటారు.

ఆమె గత ఏడాది ఈ ఆచారాన్ని పాటించడంతో కొంతమంది స్త్రీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. భర్త కాళ్ళను మొక్కడం, పూజించడం బానిసత్వంగా వర్ణించారు. ఈ రోజుల్లో కూడా భర్త పాదాలను మొక్కడం ఏంటి? అంటూ ఈ హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్ చేశారు. అయినా అవి ఏమి పట్టించుకోకుండా ఈ ఏడాది కూడా తన భర్త కాళ్లు మొక్కుతూ పూజలు చేశారు. మళ్లీ కొందరు విమర్శలు చేసినా.. ‘ఇది మా ఆచారం. ఎవరు ఏం అనుకున్నా ఈ సనాతన ధర్మాన్ని ఆచరించకుండా ఉండను.’ అంటూ నితిన్ పాదాలకు పూజలు చేస్తున్న పిక్స్‌ను ప్రణీత ఇన్‌స్టాలో పంచుకున్నారు.

Advertisement

Next Story