‘అసుర సంధ్య వేళ’.. దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న ఏవీఎస్ వారసుడు

by Harish |
‘అసుర సంధ్య వేళ’.. దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న ఏవీఎస్ వారసుడు
X

దిశ, సినిమా: ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు ఏవీయస్ (ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం) వారసుడు.. ప్రదీప్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు ‘అసుర సంధ్య వేళ’ అనే టైటిల్‌తో ఓ హారర్ లవ్ స్టోరిని తెరకెక్కించబోతున్నట్లు తాజాగా ప్రకటించాడు. అంతేకాదు ఇందులో ప్రముఖ స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్ర షూటింగ్ మార్చి నెలలోనే ఘనంగా ప్రారంభించబోతున్నట్లు తెలిపిన మేకర్స్ త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed