- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హరీశ్ శంకర్‌కు Pawan Kalyan వీరాభిమాని సూసైడ్ లెటర్
దిశ, వెబ్‌డెస్క్: గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్‌తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 'ఈసాకి కేవలం ఎంటర్‌టైన్‌మెంటే కాదు' అంటూ పవన్ కల్యాణ్ లాస్ట్ బర్త్ డే రోజున డైరెక్టర్ హరీశ్ శంకర్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో డైరెక్టర్ పవన్‌ను ఏం రేంజ్‌లో చూపించబోతున్నాడో అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ అనూహ్య వార్త పవన్ ఫ్యాన్స్‌ను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అయితే, దర్శకుడు హరీశ్ పవన్‌తో డైరెక్ట్ సినిమా చేయడం లేదని, తమిళ సినిమా 'తేరి'ని రీమేక్ చేస్తున్నాడని ఓ వార్త వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు 'వీ డోంట్ వాంట్ తేరి రీమేట్' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ కుదిపేస్తున్నారు. ఓ అభిమాని అయితే ఏకంగా డైరెక్టర్ హరీశ్ శంకర్‌కు సూసైడ్ లెటర్ రాశాడు. ''మా అభిమాన హీరోతో రీమేక్ సినిమా చేస్తే.. మా చావుకు డైరెక్టర్ హరీశ్ శంకర్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారే కారణం'' అని హెచ్చరికలు చేశారు. మరి దీనిపై హరీశ్ శంకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. దీని అనంతరం హరీశ్ శంకర్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.