ఈ న్యూ ఇయర్ నా కోసం ఎదురుచూస్తోంది: Piya Valecha

by GSrikanth |   ( Updated:2022-12-18 14:31:02.0  )
ఈ న్యూ ఇయర్ నా కోసం ఎదురుచూస్తోంది: Piya Valecha
X

దిశ, సినిమా: ప్రముఖ హిందీ నటి పియా వాలేచా తాను టెలివిజన్‌ నటనల నుంచి పూర్తిగా తప్పుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అంతేకాదు టీవీ సీరియల్స్ నటీనటుల ప్రదర్శన మరింత సులువుగా ఉండేలా కంటెంట్‌ పునరుద్ధరించాలని అభిప్రాయపడింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఓటీటీ రూపంలో సినిమాలు, సీరియల్స్‌కు గట్టిపోటీ ఎదురవుతోందని, కాబట్టి నిస్సందేహంగా ప్రతిభను మెరుగు పరుచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సూచించింది. 'కంటెంట్ విషయంలో యువత, జనాల ఆలోచనలు మారుతున్నాయి. అందుకే నేను స్మాల్ స్ర్కీన్ వదిలేసి బిగ్ స్రీన్‌పై ప్రదర్శనలు చేయాలనుకుంటున్నా. ఒకప్పుడు ధారావాహికల కోసం సెట్‌లో 20-22 గంటలు షూటింగ్ చేసిన రోజులున్నాయి. రెండు రోజులు కారులోనే పడుకున్నా. 'ఛోటీ సర్దార్ని', 'ఇమ్లీ', 'మద్దం సర్ షో'లు ఏకకాలంలో జరిగాయి. ఇది నాకు రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఆ కష్ట సమయంలోనూ నా ఏకైక లక్ష్యం బాగా పని పనిచేయాలి. పరిశ్రమలో చేరడానికి కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచి పెట్టాను. కాబట్టి నేను అన్నింటినీ పణంగాపెట్టి వృత్తికి న్యాయం చేయాలనుకున్నా' అంటూ చెప్పుకొచ్చింది. చివరగా ఈ న్యూ ఇయర్ కచ్చితంగా తనకోసం ఎదురుచూస్తోందని, రెండు OTT ప్రాజెక్ట్‌లతో పాటు, ఒక సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది.

READ MORE

మహేష్, నేను డీల్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాం: నమ్రత షాకింగ్ కామెంట్స్!!

Advertisement

Next Story