బ్రేకింగ్: ప్రముఖ నటి పల్లవి జోషికి రోడ్డు ప్రమాదం

by Satheesh |   ( Updated:2023-01-16 14:40:11.0  )
బ్రేకింగ్: ప్రముఖ నటి పల్లవి జోషికి రోడ్డు ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి, జాతీయ అవార్డ్ గ్రహీత పల్లవి జోషి రోడ్డు ప్రమాదానికి గురైంది. ది కశ్మీర్ ఫైల్స్ ఫేమ్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ''వాక్సిన్ వార్'' సినిమా షూటింగ్‌లో భాగంగా నటి గాయపడింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్ ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నటి పల్లవి జోషికి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే అప్రమత్తమైన మూవీ యూనిట్ హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story