మోడల్ దారుణ హత్య ఫ్రిజ్‌లో కాళ్లు.. తల, మొండెం కోసం గాలింపు..!

by Hamsa |
మోడల్ దారుణ హత్య ఫ్రిజ్‌లో కాళ్లు.. తల, మొండెం కోసం గాలింపు..!
X

దిశ, వెబ్ డెస్క్: ఢీల్లీలో శ్రద్దా వాకర్ ఘటన మర్చిపోక ముందే అలాంటి సంఘటనలు ఇటీవల నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. అస్సోంలో ఓ వివాహిత అత్తను, భర్తను చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టింది. ఎవ్వరికీ తెలియకూడదని శవాలను ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాస్తున్న తరహా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్ని కఠిన చర్యలు తీసుకొచ్చినా దారుణ ఘటనలకు ఆగడం లేదు. తాజాగా, మరో షాకింగ్ ఘటన హాంగ్‌కాంగ్‌లో అబ్బి చోయ్ అనే మొడల్‌ను చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అబ్బి చోయ్ మంగళవారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తైపా జిల్లాలోని ఓ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్‌లో అబ్బి చోయ్ కాళ్లను పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహం తో పాటు మాంసం ముక్కలు, ఎలక్ట్రిక్ రంపాలు, పొడవాటి రెయిన్ కోట్లు, చేతి తొడుగులు, ముసుగులను స్వాధీనం చేసుకున్నారు. అబ్బి చోయ్ తల, చేతులు మొండెం కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఆమె మాజీ భర్త తుంగ్ చుంగ్‌ కూడా ఉన్నాడు. అబ్బి చోయ్ ఆస్తిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా ఈ హత్య జరిగినట్లు సమాచారం. ఆస్తి విషయంపైనే మాజీ భర్త కుటుంబ సభ్యులు ఆమె హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే విధంగా మిగిలిన అవయవాల కోసం శునకాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story