పవన్ ఫ్యాన్‌కు గుడ్ న్యూస్.. బండ్లన్న బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా

by sudharani |   ( Updated:2023-09-14 14:27:58.0  )
పవన్ ఫ్యాన్‌కు గుడ్ న్యూస్.. బండ్లన్న బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తన అభిమాన హీరోల సినిమాలో మరోసారి స్క్రీన్‌పై చూసి అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఖుషి’, ‘గుడుంబా శంకర్’, ‘జల్సా’, ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ కాగా.. రీరిలీజ్‌లో రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టాయి. అయితే.. పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ‘గుడుంబ శంకర్’ రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. అదే టైంలో బండ్ల గణేష్ సైతం ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో.. అప్పటికే ‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ ఉందని రెండు సినిమాలు ఒకేసారి వద్దు అని పవన్ కల్యాణ్ అభిమానులు కోరడంతో గణేష్ తన ప్రయత్నంలో వెనక్కి తగ్గాడు.

ఇక తాజాగా ‘తీన్ మార్’ సినిమా రీ రిలీజ్ చేయాలని అభిమానుల నుంచి రిక్వెస్ట్ రాగా.. దీనికి బండ్ల గణేష్ సానుకూలంగా స్పందించాడు. ఈ మేరకు ‘‘తీన్ మార్’’ సినిమాను బెస్ట్ క్వాలిటీతో.. సౌండ్స్ & డైలాగ్స్ కూడా క్వాలిటీగా వచ్చేలా రీ రిలీజ్ ప్లాన్ చేస్తామని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. దీంతో మరోసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. కాగా.. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ‘తీర్ మార్’ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించాడు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్దా డిజాస్టర్‌గా నిలిచి నష్టాలు ఇచ్చింది. మరి రీరిలీజ్‌లో ఎన్ని వసూళ్లు రాబడుతుందో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed