గుండుకు భయపడి బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న పవన్ కళ్యాణ్.. ఏ సినిమానో తెలుసా?

by Disha Web Desk 8 |
గుండుకు భయపడి బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న పవన్ కళ్యాణ్.. ఏ సినిమానో తెలుసా?
X

దిశ, సినిమా : జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

పవన్ కళ్యాణ్ గుండుకు భయపడి బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేశాడంట. ఇంతకీ ఆ సినిమా ఏంటిది అనుకుంటున్నారా? గజిని మూవీ. గజిని మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూర్య హీరోగా వచ్చిన ఈ సినిమా మతిమరుపు క్యారెక్టర్‌లో ఉంటుంది. అంతే కాకుండా ఇందులో హీరో ఎక్కువగా గుండుతోనే కనిపిస్తుంటాడు. అయితే ఈ సినిమాను ఓ డైరెక్టర్ పవన్ కళ్యాణ్‌తో చేయాలని నిర్ణయించుకుని అతనిని కలిసి మాట్లాడంట. కానీ తనని గుండుతో ప్రేక్షకులు చూడలేరు, వారు ఆ సినిమాలో తనను ఆదరిస్తారో లేదో అనే భయంతో ఆ సినిమాను రిజెక్ట్ చేశాడంట. ముఖ్యంగా గుండుకు భయపడే ఆయన సినిమాను పక్కన పెట్టినట్లు సమాచారం. కానీ ఈ సినిమా రికార్డుల వర్షం కురిపించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక గజిని సినిమాలో సూర్య పాత్ర గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సూర్య ఆ పాత్రలో ఒదిగిపోయి చేశారు. ఆయన నటనకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ముందుగా నాకు చాలా భయం వేసింది. కానీ తనన నటన మాత్రం నాకు చాలా నచ్చిందంటూ ఆరోజుల్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed