రామ్ చరణ్ మరెంతో ఎదగాలి.. పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్

by sudharani |   ( Updated:2023-03-27 12:59:41.0  )
రామ్ చరణ్ మరెంతో ఎదగాలి.. పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. సెలబ్రేషన్ గ్రాండ్‌గా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కుటుంబ సభ్యులు, అభిమానులు, సెలబ్రెటీలు వరుసగా చర్రికి సుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ వైరల్‌గా మారింది.

పవన్ కళ్యాణ్ ట్వీట్.. ‘‘రామ్ చరణ్ మరెంతో ఎదగాలి.. మన్ననలు పొందాలి. అంతర్జాతీయ స్థాయి ప్రశంశలు పొందేలా ఎదిగిన రామ్ చరణ్‌కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహభావంతో మెలిగే చరణ్ మరెన్నో విజయాలు అందుకొని ఎదగాలని, అందరి మన్ననలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దైవ చింతన, ప్రశాంత చిత్తం కలిగిన చరణ్‌కి ఉన్న క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత ఆయుధాల్లాంటివి. కచ్ఛితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా.. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story