- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కప్పు కొట్టుకుని ఇంటికి బయలుదేరిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్

X
దిశ, సినిమా : తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ 7 ఇంతకు ముందు సీజన్లతో పోలిస్తే భారీగా సక్సెస్ అయింది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఫైనలిస్ట్‌లుగా శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్‌దీప్, ప్రియాంక, అర్జున్‌ను బిగ్ బాస్ వారం క్రితమే అనౌన్స్ చేశాడు. ఈ వన్ వీక్ వారిని ఇంట్లోనే ఉంచి.. ఫన్ టాస్క్‌లతో ఎంటర్‌టైన్ చేశాడు. ఇదిలా ఉంటే నిన్నటి నుంచే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ జరగ్గా.. ఆదివారం ప్రసారం కానుంది. పలువురు హీరోయిన్స్, కంటెస్టెంట్స్ డ్యాన్సులతో హోరెత్తించగా.. తాజా సమాచారం ప్రకారం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్‌గా నిలిచినట్లు తెలుస్తుంది. కప్పు కొట్టుకుని ఇంటికి బయలుదేరినట్లు సమాచారం. కాగా నెట్టింట పలు వీడియోలు ప్రత్యక్షమవడం విశేషం.
Next Story