Sree leela: శ్రీలీల చేతుల మీదుగా ‘ఓరి మాయలోడా’ సాంగ్ రిలీజ్..

by sudharani |
Sree leela: శ్రీలీల చేతుల మీదుగా ‘ఓరి మాయలోడా’ సాంగ్ రిలీజ్..
X

దిశ, సినిమా: ‘హుషారు’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజ‌స్ కంచ‌ర్ల తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శక‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబ‌ర్ 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుద‌లైన టీజర్, ‘ప‌ట్నం పిల్లా..’ అనే సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ‘ఉరుకు పటేల’ సినిమా నుంచి ‘ఓరి మాయలోడా..’ అనే లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు మేకర్స్. స్టార్ అండ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా సాంగ్ విడుద‌లైంది. హీరో ప్రేమ‌లో ప‌డిన హీరోయిన్ త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను తెలియ‌జేసే సంద‌ర్భంలో ఈ సాంగ్ వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed