ఆ ఓటీటీ లోకి ఒకే ఒక జీవితం ఎప్పుడంటే..! Oke Oka Jeevitham OTT

by srinivas |   ( Updated:2022-09-25 15:10:13.0  )
ఆ ఓటీటీ లోకి ఒకే ఒక జీవితం ఎప్పుడంటే..! Oke Oka Jeevitham OTT
X

దిశ,వెబ్‌డెస్క్: శర్వానంద్ హీరో గా నటించిన సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమాకు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిగా.. ఎస్ ఆర్ ప్రభు,ఎస్ ఆర్ ప్రకాష్‌బాబు నిర్మించారు. కీలక పాత్రలో రీతూ వర్మ, అమల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటించారు. ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 9 విడుదల కాగా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ రెస్పాన్స్ తో ఈ సినిమా దూసుకుపోయింది. వరుస ప్లాప్ లో ఉన్న శర్వానంద్ ఒకే ఒక జీవితం తో బిగ్ హిట్ అందుకున్నాడు.

హీరో శర్వానంద్ కు ఇది 30వ సినిమా కావటం విశేషం. అయితే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా అందరి హృదయాలను దోచుకుంది.ఈ క్రమంలో డిజిటల్ హక్కులను 15 కోట్లకు సోనీ లీవ్ వారు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ రెండో వారం లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. త్వరలో డిజిటల్ స్ట్రీమింగ్ పై చిత్రం బృందం అధికారిక ప్రకటన చేయనున్నారు.

Next Story

Most Viewed