- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
NTRపై క్షుద్ర పూజలు చేశారు: భార్య సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి.. చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు ఎన్టీఆర్. కానీ సినిమాలకు మధ్యలోనే గుడ్‌బై చెప్పి ఫ్యాన్స్‌ను నిరాశపరిచారు. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. తెలుగు దేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయిన తర్వాత ఆంధ్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో మంచి సేవా కార్యక్రమాలను చేశారు. ఇక ఎన్టీఆర్ మరణాంతరం చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలను తన చేతులలోకి తీసుకొని ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ పార్టీని ముందుకు తీసుకువచ్చారు. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు అంటూ చంద్రబాబుపై ఇప్పటికి ప్రతిపక్షాల పార్టీల వారు విమర్శిస్తూనే ఉంటారు. ఇక తాజాగా చంద్రబాబు స్కిల్ డెవలప్ స్కామ్‌లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు అరెస్టు కావడంతో ఎంతోమంది ఈయన అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. కానీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అరెస్ట్ అవడంతో నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడటంతో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి తాజాగా స్పందించి.. ‘‘భర్త అధికారం కోసం నారా భువనేశ్వరి ఏ తండ్రికి చేయని ద్రోహం ఎన్టీఆర్‌కు చేసింది. అప్పట్లో ఎన్టీఆర్ పై క్షుద్ర పూజలు చేయించింది. ఈ విషయం ఆయనకు తెలిసి చాలా బాధపడ్డారు. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎవ్వరూ రాలేదు. మేం ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ఎవరు తనని చూడటానికి కూడా రాలేదు. కానీ భువనేశ్వరి మాత్రం తన భర్త ముఖ్యమంత్రి కావాలని ఎన్నో క్షుద్ర పూజలు చేయించింది’’ అంటూ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది.