ఇప్పుడు విడిపోయే సమయం వచ్చింది నా ప్రయాణం వేరు.. శిల్పాశెట్టి భర్త ఆసక్తికర ట్వీట్..

by Hamsa |   ( Updated:2023-10-21 22:05:22.0  )
ఇప్పుడు విడిపోయే సమయం వచ్చింది నా ప్రయాణం వేరు.. శిల్పాశెట్టి భర్త ఆసక్తికర ట్వీట్..
X

దిశ, వెబ్‌డెస్క్: శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా జంట గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవల వీరిద్దరు నిత్యం పలు మీడియా సమావేశాల్లో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే రాజ్‌కుంద్రా శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ‘‘మేమిద్దరం విడిపోతున్నాం.. ఈ క్లిష్ట సమయంలో మాకు కాస్త విరామం ఇవ్వండి’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన వారంతా వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారని సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. ఇక శిల్పాశెట్టి సోషల్ మీడియా ఖాతాలలో మాత్రం తన భర్తకు విషెస్ తెలుపుతూ పోస్ట్ చేయడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇదిలా ఉంటే తాజాగా, రాజ్‌కుంద్రా మరో ట్వీట్ చేశాడు. ‘‘మాస్కులకు వీడ్కోలు.. ఇప్పుడు మేము విడిపోయే సమయం వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నా ప్రయాణం వేరు’’ అని రాసుకొచ్చాడు. దీంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అతను పోస్టులు విడాకుల గురించి కాదని మాస్కుల గురించి అని తెలిసి ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

Read More: అలాంటి వారి పక్కన ఉండటం డేంజర్ అంటూ శృతి హాసన్ పోస్ట్.. బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడా?

Advertisement

Next Story