Nithin: నితిన్ ఒకేసారి రెండు సినిమాలతో రాబోతున్నాడట!

by Prasanna |   ( Updated:2023-04-26 14:36:51.0  )
Nithin: నితిన్ ఒకేసారి రెండు సినిమాలతో  రాబోతున్నాడట!
X

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా మాచర్ల నియోజకవర్గం.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. కనీస వసూళ్లను కూడా సాధించలేకపోయింది. దీంతో నితిన్ పనైపోయిందని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు నితిన్ ఒకేసారి రెండు సినిమాలతో మన ముందుకు రాబోతున్నాడట. ఇప్పటికి ఒక సినిమా షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకోగా మరో సినిమా షూటింగ్ కార్యక్రమం జరగనుంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలో రెండు సినిమాలతో సందడి చేయనున్నాడని తెలుస్తుంది. మొదట విడుదలయ్యే సినిమా హిట్ అయితే తర్వాత సినిమా వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నితిన్ భావిస్తున్నాడట.

Also Read...

Amala Paul as a nude performer : నగ్నంగా నటించేందుకు సిద్ధంగా ఉన్నా..

Advertisement

Next Story