- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నిహారిక ‘డెడ్ పిక్సెల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: మెగా వారసురాలు నిహారిక కొణిదెల త్వరలోనే ఒక న్యూ ఏజ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌తో రాబోతోంది. ‘డెడ్ పిక్సెల్’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సిరీస్ మే-19 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక కొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ వెబ్ సిరీస్.. ఈ తరం ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుగా తెలుస్తోంది.
ఇందులో నిహారిక ఒక గేమర్‌గా నటించింది. ఓ నలుగురు కుర్రాళ్ళు కలిసి ఒక కొత్త తరహా గేమ్‌ను క్రియేట్ చేస్తారు. అయితే.. దానివల్ల వాళ్ళు పొందింది.. పోగొట్టుకుంది ఏంటి అనే కాన్సెప్ట్ తో వస్తుంది టీమ్. కాగా.. నిహారికతో పాటు వైవా హర్ష, అక్షయ్, సాయి రోనక్, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.