- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటివి మానేసి అసలైన జర్నలిజాన్ని కాపాడండి.. మీడియాపై వరలక్ష్మి శరత్ కుమార్ ఆగ్రహం
దిశ, సినిమా: నటి వరలక్ష్మి శరత్ కుమార్ అందరికీ సుపరిచితమే. ఆమె పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి హిట్స్ అందుకుంది. వరలక్ష్మి ఇటీవల హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఆమె ఓ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా బాగానే ఉన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. తన మాజీ అసిస్టెంట్ ఆదిలింగం డ్రగ్స్ ఆయుధాల సరఫరాలో ట్రాఫికర్ లతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ ఐఏ గుర్తించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతను గతంలో పని చేసిన వరలక్ష్మికి కూడా నోటీసులు పంపినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలో.. తాజాగా, వరలక్ష్మి డ్రగ్స్ కేసు అరెస్ట్‌పై స్పందించింది. తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు ఎలాంటి సమన్లు, ఫోన్ కాల్స్ రాలేదు. నా ఫొటో ఉపయోగించి వరలక్ష్మీ మేనేజర్ కు నోటీసులు అంటు వార్తలు రాస్తున్నారు. మంచి వార్తలు దొరకకపోవడంతో పలు మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం నిజంగా బాధాకరం. విలేకర్లు, వెబ్‌సైట్స్‌కు నేను చేప్పేది ఒక్కటే. అసలైన జర్నలిజాన్ని కాపాడండి. నిజాలు రాయండి ప్రముఖులు, సెలబ్రిటీల లోపాలను వెతకడం మానుకోండి.
సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించేందుకు మేము చాలా కష్టపడుతున్నాము. మా పని మేము చేసుకుంటున్నాం. కాబట్టి మీ పని మీరు ఎందుకు చేయడం లేదు. సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిపై దృష్టి పెట్టండి, మా సహనాన్ని బలహీనత గా భావించొద్దు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపండి. పరువునష్టం కేసులు కూడా ట్రెండింగ్ అవుతున్నాయి’’ అంటూ రాసుకొచ్చింది. ఇలాంటి వార్తలు రాసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేయడానికి వెనుకాడబోనని చెప్పకనే చెప్పేసింది. ప్రస్తుతం వరలక్ష్మి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.