- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pawan Kalyan వారసుడు Akira Nandan ఎంట్రీ పై నెటిజన్ విమర్శ.. Renu Desai రియాక్షన్ ఇదే?
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ ఎంట్రీ గురించి నెట్టింట పలు వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు అకీరా యూఎస్‌లో ఫిలిం స్కూల్‌లో యాక్టింగ్ కోర్స్ తీసుకుంటున్నట్లు ఓ పోస్ట్ చేశారు. అయితే దీనిపై రేణు దేశాయ్ అకీరాకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ‘ఫిలిం స్కూల్స్ లో వందలాది మంది నటన నేర్చుకుంటారు. గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడతారు. కానీ ఒక స్టార్ వారసుడిగా ఎలాంటి కష్టం లేకుండా హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటారు’ అని కామెంట్ చేశాడు.
తాజాగా, దానికి రేణు దేశాయ్ స్పందిస్తూ.. ‘‘మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. అంబానీ తన కంపెనీని తన కొడుకు, కూతురికి కాకుండా బయట వాళ్ళకి ఇవ్వడం సమంజసమే అంటారా? అవును వారసులుగా హీరో, నిర్మాత, డైరెక్టర్ పిల్లలు ఈజీగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఆ ఎంట్రీ చాలా ఈజీనే, కానీ వారి పేరెంట్స్ లెగసీని ముందుకు తీసుకు వెళ్లకపోయినా, నటుడిగా వాళ్ళని నిరూపించుకోవడంలో ఫెయిల్ అయినా.. ఏమాత్రం జాలి లేకుండా చాలా దారుణంగా మీరే ట్రోల్ చేస్తారు. అలా స్టార్స్ వారసులుగా కాకుండా, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారి ఫెయిల్యూర్ ని ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ వాళ్ళు సక్సెస్ అయితే రజినీకాంత్, మాధురీ దీక్షిత్ వంటి స్టార్స్ అవుతారు. ఇక్కడ హీరో వారసుడు అనేది ముఖ్యం కాదు. మీలోని టాలెంట్ ఇంపార్టెంట్. కాబట్టి మీలో ఉన్న టాలెంట్ పై ఫోకస్ పెట్టి, దాన్ని బయట పెట్టే ప్రయత్నం చెయ్యండి’’ అంటూ రిప్లై ఇచ్చింది.
ఇవి కూడా చదవండి : Pawan Kalyan ఫ్యాన్స్ అలర్ట్.. పుట్టినరోజున ఫుల్ మీల్స్ ఖాయం!