హార్దిక్ పాండ్యా సోదరుడు కృణాల్ పాండ్య పోస్ట్‌పై నటాషా ఇంట్రెస్టింగ్ కామెంట్!..

by Kavitha |   ( Updated:2024-05-28 05:07:42.0  )
హార్దిక్ పాండ్యా సోదరుడు కృణాల్ పాండ్య పోస్ట్‌పై నటాషా ఇంట్రెస్టింగ్  కామెంట్!..
X

దిశ, సినిమా: గత కొన్ని రోజులుగా క్రికెటర్ హార్దిక్ పాండ్యా.. తన భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇద్దరూ స్పందించకపోవడంతో విడిపోతున్నారని పక్కాగా క్లారిటీ వచ్చేసింది.

అయితే తాజాగా హార్దిక్ సోదరుడు.. క్రికెటర్ కృణాల్ పాండ్య చేసిన పోస్ట్‌పై నటాషా కామెంట్ చేసారు. కృణాల్ తన కుమారుడిని.. హార్దిక్ కుమారుడిని ఎత్తుకుని దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఆ ఫోటోపై లవ్లీ ఎమోజీతో నటాషా రియాక్ట్ అయ్యారు. సాధారణంగా ఒక జంట విడిపోతున్నట్లయితే వారి ఇంట్లో వాళ్లకు సంబంధించిన ఎలాంటి పోస్ట్‌లపై స్పందించరు. మరి ఇప్పుడు నటాషా స్పందించింది. దీంతో అసలు వీరు విడిపోతున్నారా లేదా అనే డైలమాలో ఉన్నారు అభిమానులు. ఇక ఆ విషయంపై వారిద్దరూ కన్ఫామ్ చేస్తే కానీ ఫ్యాన్స్‌కి ఓ క్లారిటీ వచ్చేలా లేదు.

Advertisement

Next Story

Most Viewed