ఆ హీరోయిన్‌కు సవతిగా మారనున్న నటాషా.. ఫ్రెండ్ అంటూనే హార్దిక్ కొంప ముంచేశాడు..

by Sujitha Rachapalli |
ఆ హీరోయిన్‌కు సవతిగా మారనున్న నటాషా.. ఫ్రెండ్ అంటూనే హార్దిక్ కొంప ముంచేశాడు..
X

దిశ, సినిమా: హార్దిక్ పాండ్య - నటాషా విడాకుల మ్యాటర్ గురించి రోజుకో అప్ డేట్ చక్కర్లు కొడుతుంది. నిన్న మొన్నటి వరకు భరణం గురించి టాపిక్ ట్రెండింగ్ లో ఉండగా.. తాజాగా ఆమె ఎవరిని లైన్ లో పెట్టిందనే విషయంపై చర్చ జరుగుతుంది. ఇన్ని రోజులుగా ఈ విషయం వైరల్ అవుతున్నా హార్దిక్ నోరు విప్పకపోవడంతో రూమర్స్ నిజమేనని కన్ఫర్మేషన్ కు వచ్చారు నెటిజన్లు. అయితే నటాషా.. దిశా పఠాని బాయ్ ఫ్రెండ్ అలెక్సాండర్ అలెక్స్ ను పెళ్లి చేసుకుందని.. ఇందుకు సంబంధించిన ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.

కాగా క్రికెటర్ తో నటాషా పెళ్లి జరిగినప్పటి నుంచే ఫ్రెండ్ పేరు చెప్పుకుని క్లోజ్ గా ఉన్నాడట అలెక్స్. వీరిద్దరి మధ్య నిల్చొని ఫొటోలు కూడా దిగాడట. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న మీమర్స్.. కామెంట్లతో ఆడేసుకుంటున్నారు. 'ఫ్రెండ్ అంటూనే కొంప ముంచావ్ కదరా.. అప్పటి నుంచే ఈ చక్కర్ నడుస్తుందా? నేనే పిచ్చోడిని అర్థం చేసుకోలేకపోయా ', ' ఏంది మావా ఇద్దరు కలిసి ఇంత పని చేశారు?' అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏదేమైనా హార్ధిక్ బాగా బాధలో ఉన్నాడబ్బా అంటూనే నవ్వుకుంటున్నారు. నటాషా.. దిశా పఠాని సవతిగా సెటిల్ అవుతుందా ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.





Advertisement

Next Story

Most Viewed