షాకింగ్ ఫొటోలు రివీల్ చేసి భయపెట్టిన నాగచైతన్య బ్యూటీ.. ఆసక్తికర పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-09-14 14:13:07.0  )
షాకింగ్ ఫొటోలు రివీల్ చేసి భయపెట్టిన నాగచైతన్య బ్యూటీ.. ఆసక్తికర పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: శ్రేయా ధన్వంతరి నాగచైతన్య ‘జోష్’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ అమ్మడు ఇందులో నాగచైతన్యకు ఫ్రెండ్‌గా నటించింది. ఆ తర్వాత స్నేహగీతంలో హీరోయిన్‌గా చేసింది. అయితే శ్రేయా అందం, అభినయంతో మెప్పించినప్పటికీ అనుకున్నంత క్రేజ్ దక్కించుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, శ్రేయా షాకింగ్ ఫొటోలు షేర్ చేసి అందరినీ భయపెట్టింది. అద్భుత్ హారర్ థ్రిల్లర్ మూవీ షూటింగ్‌లో తీసుకున్న పిక్స్ పెడుతూ సెప్టెంబర్ 15న సోనీ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో దెయ్యంగా కనిపించబోతున్న ఆమె ఆ లుక్స్‌ను నెట్టింట పెట్టడంతో సడెన్‌గా చూసినవారంతా శ్రేయాకు ఏమైందని కంగారు పడుతున్నారు. ఆ తర్వాత షూటింగ్‌కు సంబంధించిన పిక్స్ అని తెలుసుకుని ఊపిరిపీల్చుకుంటున్నారు.

Advertisement

Next Story