- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
‘నా భార్య 9 నెలల గర్భవతి’.. శేఖర్ బాషా ఇంటర్వ్యూ వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: రేడీయో జాకీ, టీవీ యాంకర్‌గా, క్రికెట్ కామెంటేటర్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు శేఖర్ బాషా. టీవీ రంగంలో ఒక దశాబ్దం పాటు జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ టీవీ ఛానల్ లలో వీజేగా వ్యవహరించాడు. 2019 ఇండియా-వెస్ట్ఇండీస్ క్రికెట్ సీజన్ కి క్రీడా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. మన ఇండియాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రేడియో అవార్డు ‘ఎక్సలెన్స్ ఇన్ రేడియ’ ఐఆర్ఎఫ్ పురస్కారాన్ని 19 సార్లు గెలుచుకున్న ఏకైక వ్యక్తి శేఖర్ బాషా.
ఇకపోతే శేఖర్ బాషా ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్-8 లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హౌస్‌లో సందడి చేస్తూ బిగ్‌బాస్ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. సిట్యూవేషన్ దగ్గట్లు పంచ్‌లు, కుళ్లు జోకులు వేస్తూ జనాల్ని నవ్విస్తున్నాడు. కానీ అప్పుడప్పుడు డల్ గా ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటాడు. తాజాగా శేఖర్ అలా ఉండటానికి కారణమేంటో తెలిసిపోయింది.
శేఖర్ బాషా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేముందు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో బాషా తన భార్య గర్భవతి అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా బిగ్‌బాస్‌కు వెళ్లడం తన భార్య కోరికేనని తెలిపాడు. బిగ్‌బాస్‌ది ఏం ఉంది తర్వాత వెళ్దాంలే అని చెప్పినా ఆమె వినలేదని, తప్పకుండా వెళ్లాలని చెప్పిందని బాషా వెల్లడించారు. మీ వైఫ్ 9 నెలల ప్రెగ్నెన్సీ అయినా హౌస్‌లోకి వెళ్తున్నారు.. మీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలంటూ యాంకర్ బాషాపై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ శేఖర్ ఇప్పటివరకు తన భార్య గర్భవతి అనే విషయాన్ని హౌస్‌లో చెప్పలేదు. అస్సలు ఆ ప్రస్తావన కూడా ఎప్పుడు తీసుకరాలేదు. ఒంటరిగా కూర్చుని బాధపడతాడే తప్ప.. ఎవరి దగ్గర సింపథీ చూపించుకునే ప్రయత్నం చేయలేదు. అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక శేఖర్ బాషా భార్యకు సెప్టెంబరు 14 వ తేదీన డెలీవరీ కానుందని సమాచారం. ప్రస్తుతం శేఖర్ బాషా ఇంటర్వ్యూ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.