- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో నా పేరెంట్స్ సంతృప్తిగా లేరు: రష్మిక ఎమోషనల్
దిశ, సినిమా : ఇటీవల ‘ఐఎండీబీ’ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో మూడో స్థానం దక్కించుకోవడంపై రష్మిక మందన్న ఇట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ అనుభవాల గురించి మాట్లాడుతూ నటిగా ఎంతో ఎత్తుకు ఎదిగానా, ఎన్ని అవార్డులు సాధించిన తన పేరెంట్స్ ఇంకా గర్వంగా ఫీల్ కావట్లేదని చెప్పింది. ‘నా తల్లిదండ్రులు నా పని విషయంలో సంతృప్తిగా లేరు. ఎందుకంటే వాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. నేను ఏం చేస్తున్నానో వాళ్లికింకా పూర్తిగా అర్థం కాలేదు. అవార్డు వచ్చిందంటే ఆనందిస్తారు. ఏదైనా కావాలంటే తెచ్చిపెడతారు. ఆర్థికంగా నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టరు. వాళ్ల కష్టాలన్నీ నేను దగ్గరుండి చూశాను. నా పేరెంట్స్ నిజంగా గర్వపడేలా చేయాలంటే నేను మరింత కష్టపడాలి. వాళ్ల శ్రమకు తగ్గ ఫలితం కావాలంటే నేను ఉన్నత శిఖరాలకు ఎదగాల్సివుంది’ అంటూ ఎమోషనల్ అయింది.
Read More: ఇంటి గుమ్మం ముందు ఆ సింబల్స్.. నటికి షాక్ ఇచ్చిన అభిమాని