మసీద్‌‌లో హిందువుల పెళ్లి.. వీడియో షేర్ చేసిన రెహమాన్

by Anjali |   ( Updated:2023-05-04 08:04:36.0  )
మసీద్‌‌లో హిందువుల పెళ్లి.. వీడియో షేర్ చేసిన రెహమాన్
X

దిశ, సినిమా: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్ రెహమాన్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్‌గా ఉంటాడు. అయితే రీసెంట్‌గా ఆయన షేర్ చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. కేరళలోని ఒక మహిళ తన కూతురు పెళ్లి చేయడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దీంతో పెళ్లికి సహాయం చేయాలంటూ స్థానిక మసీద్‌ కమిటీని ఆశ్రయించింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న మసీదు పెద్దలు.. ఆమె కూతురు పెళ్లిని మసీదులోనే హిందూ సాంప్రదాయం ప్రకారం ఘనంగా జరిపించారు. అంతేకాదు కట్నంగా 10 సవర్ల బంగారం, 20 లక్షల క్యాష్ ఇచ్చారు. పెళ్లికి వచ్చిన 1000 మందికి పైగా అతిథులకు విందు ఏర్పాటు చేసి గొప్ప మనసు చాటుకున్నారు. కాగా ఈ వీడియో షేర్ చేసిన రెహమన్ ‘మీ మానవత్వానికి జోహార్లు’ అంటూ ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story