- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగరంగ వైభవంగా జరిగిన మురళీమోహన్ స్వర్ణోత్సవ వేడుక..
దిశ, సినిమా: సీనియర్ నటుడు మురళీ మోహన్ చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్బాన్ని పురస్కరించుకొని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా అలాగే తెలుగు సినిమా వేదిక సంస్థలు ఆయనను ఘనంగా సత్కరించాయి. ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా, వీస్ విజయ్ వర్మ పాకలపాటి, నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర ప్రసాద్, సెక్రటరీ ప్రసన్న కుమార్, వ్యాపార వేత్త కోగంటి సత్యం ఇలా 20 మంది యువ కధానాయకుల సమక్షంలో పండితుల వేదమంత్రాల మధ్య మురళి మోహన్‌ని ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మురళి మోహన్ మాట్లాడుతూ ‘అట్లూరి పూర్ణచంద్రరావు గారి చేతుల మీదుగా 33 వ ఏట కళామతల్లి ఆశీస్సులు పొందిన నేను నటుడిగా, వ్యాపారవేత్తగా విజయవంతంగా రాణించాను. ఈ క్రమంలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అని తెలిపారు. అలాగే నిర్మాతల మండలి అధ్యక్ష కార్యదర్సులు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు వశిష్ఠ, తెలంగాణ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు రాజశేఖర్ తదితరులు మురళీ మోహన్ ఔనత్యాన్ని కొనియాడారు. స్వర్ణోత్సవ వేళ ఓ గొప్ప నటుడిని సత్కరించుకొనే అవకాశం రావడం పట్ల చైతన్య జంగా, విజయ్ వర్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామ్ రావిపల్లి అందించిన ప్రశంసా పత్రం, మిమిక్రి రమేష్ చేసిన ఎంటర్టైన్మెంట్ అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది.
Read More..
బన్నీ-చరణ్ మల్టీస్టారర్ చిత్రానికి టైటిల్ ఫిక్స్.. 10 ఏళ్ల క్రితమే రిజిస్టర్ చేసిన అల్లు అరవింద్!
- Tags
- Murali Mohan