- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఆ హీరోలో అది చూస్తూ ఉండిపోతా.. మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
దిశ, సినిమా : సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీ ఈ మధ్య వరస సినిమాలతో బిజీ అయిపోయింది. బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకొని, వరస సినిమాలు చేస్తోంది. ఇక తెలుగులో ఈ మధ్య హాయ్ నాన్న సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న బ్యూటీ, ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్లాప్ అందుకుంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. యాంకర్ మీ అభిమాన నటుడు ఎవరు అని అడగ్గా, నా ఫేవరెట్ హీరో షాహిద్ కపూర్.. ఆయనతో నేను జెర్సీ సినిమాలో నటించినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే జెర్సీ సినిమా లొకేషన్ అనుభవాన్ని తన అభిమానులతో పంచుకుంది. నటి మాట్లాడుతూ..షాహిద్ చాలా ఇష్టమని, తనతో నటించడానికి అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఆ సినిమాకు వెంటనే ఒకే చెప్పేసే, తన నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. షాహిద్ లొకేషన్‌లో నవ్వుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోతా, ఇక మూవీలో ఒక సీన్‌లో షాహిద్‌ను కొట్టాలి. ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డట్టు ఆమె తెలిపింది. ప్రస్తుతం మృణాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read More..
సమంత ఆఫర్ కొట్టేసిన అలియా.. చివరి క్షణంలో ఆ హీరో అలా చేసినందుకేనా?