- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MEGASTAR CHIRANJEEVI: చిరంజీవి ఎత్తుకుని ముద్దాడుతోన్న ఈ బుడ్డోళ్లు ఎవరో గుర్తుపట్టండి..!
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తన డాన్స్, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ముందుండే వారిలో మన టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరో చిరు కూడా ఒకరు. ఇండస్ట్రీకొచ్చి కేవలం ఈ హీరో మాత్రమే ఎదగకుండా.. మెగా ఫ్యామిలీలోని వారసులనంతా సినీ పరిశ్రమకు పరిచయం చేసి.. నేడు మంచి స్థాయిలో నిలబెట్టారు. ఇకపోతే పలువురి సినీ సెలబ్రిటీల ఫొటోలు అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉండటం చూస్తూనే ఉంటాం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇద్దరి పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడుతోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ బాబు మరో బాబును బుగ్గగిల్లుతుండటం చూడొచ్చు.
చూడానికి ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చిరు ఎత్తుకున్న ఈ బుడ్డోళ్లు ఎవరో కాదు.. ‘రామ్ చరణ్ అండ్ అల్లు శిరీష్’. ప్రస్తుతం ఈ హీరోలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. త్వరలో అల్లు శిరీష్ ‘బడ్డీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్స్, టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న రామ్ చరణ్ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు లో విడుదల కానుంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.