- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భగవంతుడితో దయతో మా ఆశ నెరవేరింది: చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడ బిడ్డ పుట్టడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఇవాళ ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మనవరాలిను చూసేందుకు చిరు ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం చిరు మీడియాతో మాట్లాడుతూ.. చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కావాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశామని.. ఇప్పటికి ఆ భగవంతుడి దయతో మా ఆశ నెరవేరిందని అన్నారు.
ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపమని.. మా ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా ఉన్నామని తెలిపారు. ఇక, మెగా ఫ్యామిలీలోకి మరో వారసురాలు ఎంట్రీ కావడంతో చిరు కుటుంబమంతా సంతోషంలో ముగినిపోయింది. చరణ్, ఉపాసనల కూతురిని చూసేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం అపోలో ఆసుపత్రికి క్యూ కట్టారు. తమ అభిమాన నటుడికి కూతురు పుట్టిందన్న విషయం తెలుసుకోని చెర్రీ, మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుని సందడి చేస్తున్నారు.
Read More: లిటిల్ ప్రిన్సెస్ నీ రాకతో మెగా ఫ్యామిలీకి ఉత్సాహం తీసుకొచ్చావ్.. చిరంజీవి ట్వీట్
రామ్ చరణ్ సతీమణి ఉపాసన 9 నెలలు గడవక ముందే తల్లి అయిందా?
Allu Arjun: మెగా ప్రిన్సెస్ ని చూడటానికి అపోలో హాస్పిటల్ కి వెళ్లిన ఐకాన్ స్టార్ బన్నీ (వీడియో)