- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Varun Tej- Lavanya Tripathi: పెళ్లి అయిన తర్వాత భార్యకు దూరంగా మెగా ప్రిన్స్.. కారణం అదేనా?
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి వరుణ్ వరుస మూవీస్ చేస్తూ విజయం కోసం తాపత్రయ పడుతున్నాడు. కానీ హిట్ కొట్టలేకపోతున్నాడు. ప్రజెంట్ ‘మట్కా’ షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక లావణ్య విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత ‘మిస్ ఫర్‌ఫెక్ట్’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. కానీ ఆ తర్వాత ఎలాంటీ ప్రాజెక్ట్స్ ప్రకటించకుండా సైలెంట్‌గా ఉంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ అడపా దడపా పోస్ట్‌లు పెడుతుంది. వరుణ్‌కు షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా వెకేషన్‌కు వెళ్తూ ఈ జంట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత ఫస్ట్ టైం భార్యకు దూరంగా వెళ్లబోతున్నాడు అంటూ ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. మరి వరుణ్ ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం వరుణ్ తేజ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘మట్కా’ అనే పీరియాడికల్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులకు కూడా వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా ఆ రెండు కొత్త సినిమాలలో మొదటిది మేర్లపాక గాంధీ దర్శకత్వంలో.. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై వస్తున్న సినిమా. అయితే ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం విదేశాల్లో జరగనుందని సమాచారం. అందుకోసం ఈ మెగా హీరో కొరియా వెళ్లనున్నారు. సెప్టెంబరు చివరి వారంలో ఈ మూవీ షెడ్యూల్‌ను ప్రారంభించి, ఒకే షెడ్యూల్‌లో ఎక్కువ భాగం చిత్రీకరణను ముగించాలని మేకర్స్ భావిస్తున్నారు.
అలాగే వరుణ్ ఓకే చేసిన మరో మూవీ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఓ ప్రేమకథ. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా యూఎస్ఏలో మొదలవుతుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ చిత్రం కొరియా షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఇది ప్రారంభమవుతుంది. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్స్ కోసమే వరుణ్ తన భార్య లావణ్యను వదిలి కొన్నాళ్ళు విదేశాల్లో ఉండబోతున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.