Upasana: యువ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన మెగా కోడలు ఉపాసన

by Anjali |   ( Updated:2024-09-03 14:51:12.0  )
Upasana: యువ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన మెగా కోడలు ఉపాసన
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలైన ఈమె మెగా హీరో రామ్ చరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి దాదాపు పదకొండేళ్ల తర్వాత పండండి ఆడబిడ్డ జన్మించింది. ఈ బుజ్జాయి రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఈ ప్రిన్సెస్‌కు క్లింకార అని నామకరణం చేశారు. కానీ ఇప్పటికీ రామ్ చరణ్ గారాల పట్టి ఫేస్ రివీల్ చేయకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. వెకేషన్స్‌కెళ్లినా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకున్నప్పటికీ క్లింకార ముఖానికి ఎమోజీలతో కవర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా..

మెగా కోడలు ఉపాసన మహిళలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాజాగా చరణ్ సతీమణి ఇండియన్ స్కూల్ ఆఫ్ కళాశాలలోని ఓ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. హెల్త్ కేర్ రంగంలో వ్యాపారం చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి యువ మహిళలకు తను సపోర్ట్ చేస్తానని తెలిపారు. ఉపాసనతో చేతులు కలపండని అన్నారు. అంతేకాకుండా వారికి కో ఫౌండర్, పార్నర్ అవుతానని వెల్లడించారు. భారతదేశంలో హెల్త్ కేర్ సిస్టంలో మార్పు తీసుకురావడానికి సహాయం చేస్తానని పేర్కొన్నారు. [email protected] అనే వెబ్ సైట్‌లో వివరాలు పొందుపరచొచ్చని తెలిపారు.

Advertisement

Next Story