Mega Heroes: కోలీవుడ్ వైపు చూస్తున్న మెగా ఫ్యామిలీ? ఎందుకో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-03-20 03:18:34.0  )
Mega Heroes: కోలీవుడ్ వైపు చూస్తున్న మెగా ఫ్యామిలీ? ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో మొన్నటి వరకు తెలుగు డైరెక్టర్స్ తో వర్క్ చేసిన మెగా హీరోలు ఇప్పుడు రూటు మార్చేశారు. కథ నచ్చితే తమిళ దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అంటున్నారు. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న చెర్రీ ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ ని శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే 50% షూటింగ్ కంప్లిట్ అయ్యింది. ఏప్రిల్లో రెండో షెడ్యూల్ మొదలవుతుంది. వచ్చే సంక్రాంతికి RC15 మన ముందుకు రాబోతుంది. తమిళ్లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ ప్రాజెక్ట్ కూడా డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. శర వేగంగా షూటింగ్ జరుపుతున్న దర్శకుడు వచ్చే దసరాకి మన ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. పవన్ కళ్యాన్ , రామ్ చరణ్ తమిళ దర్శకులతో సెట్ ఐపోతే.. తాజాగా చిరు కూడా తమిళ దర్శకుడు పి.యస్ మిత్రన్ తో ఓ సినిమా చేయనున్నారట. మెగా హీరోలు కోలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయడం చర్చనీయాశంగా మారింది.

Also Read..

Mega Heroes: కోలీవుడ్ వైపు చూస్తున్న మెగా ఫ్యామిలీ? ఎందుకో తెలుసా?

Advertisement

Next Story