మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. 100 సార్లు రిహార్సల్స్ చేశాడట

by Hamsa |   ( Updated:2023-05-18 09:09:39.0  )
మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. 100 సార్లు రిహార్సల్స్ చేశాడట
X

దిశ, సినిమా : ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’లో తాను పోషించిన లాయర్ పాత్ర సరికొత్త పాఠం నేర్పిందంటున్నాడు మనోజ్ బాజ్‌పేయి. మే 23నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయన.. కోర్టులో జరిగిన మోనోలాగ్‌ సీన్ కోసం షూట్ ప్రారంభించకముందే 100 సార్లు రిహార్సల్ చేసినట్లు తెలిపాడు. అలాగే ఒక సామాన్య మనిషి, అసాధారణమైన పనిచేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచే తీరును చూపించే ఈ కథ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నాడు. అంతేకాదు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభావవంతమైన దైవానికి వ్యతిరేకంగా పోరాడే లాయర్‌గా నటించడం, కోర్టు రూమ్ డ్రామాలో బాధితురాలి పట్ల సున్నితంగా వ్యవహరిస్తున్నపుడు నిజమైన బాధ్యతగా ఫీల్ అయ్యానని తెలిపాడు.

Also Read: ఆయనతో పనిచేయాలనేది నా డ్రీమ్.. ఇన్నాళ్లకు నెరవేరింది

Advertisement

Next Story