విమానంలో ఫుల్‌గా తాగి స్పృహ తప్పిన మనోజ్.. ఫస్ట్ టైమ్ అంటూ

by Anjali |   ( Updated:2023-04-18 13:31:58.0  )
విమానంలో ఫుల్‌గా తాగి స్పృహ తప్పిన మనోజ్.. ఫస్ట్ టైమ్ అంటూ
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఆసక్తికర సంఘటనపై ఓపెన్ అయ్యాడు. ఈ మేరకు ఓ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌లో మొదటిసారి పారిస్ వెళ్లిన ఆయన.. మద్యం ఫ్రీగా వస్తుందని పీకల దాకా తాగేసినట్లు గుర్తుచేసుకున్నాడు. ‘థియేటర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న క్రమంలో పారిస్ వెళ్లాను. అదే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ జర్నీ. విమానంలో మందు సర్వ్ చేశారు. అడిగితే డబ్బులు ఇవ్వమంటారోనని ఊరుకున్నా. ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు. కానీ, తిరుగు ప్రయాణంలో మద్యం ఫ్రీగానే ఇస్తారని తెలిసింది. దీంతో రిటన్‌లో కావాల్సినంత తాగేశా. స్పృహ కూడా లేదు’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. అలాగే చాప్ స్టిక్స్ తినడం కూడా అదే ఫస్ట్ టైమ్ అని చెప్పిన నటుడు తినడానికి చాలా ఇబ్బందిపడ్డానని, కొన్ని కసరత్తుల తర్వాత తినడం నేర్చుకున్నానని వెల్లడించాడు.

Also Read..

సేమ్ సెక్స్ మ్యారేజ్ నేరం కాదు.. స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story