ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?

by Dishafeatures1 |
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..  స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?
X

దిశ,సినిమా: ఈ మధ్యకాలంలో మలయాళ చిత్రాలు మంచి పాపులారిటీ అందుకుంటున్నాయి. దీంతో మిగతా పరిశ్రమ వాళ్ళు ఈ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్‌లో కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన మూవీస్‌ని డబ్బింగ్ చేయించి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ అయి మంచి కలెక్షన్‌లు రాబట్టాయి. అలా మంచి వసూల్ రాబట్టిన వాటిలో ‘మంజుమ్మల్ బాయ్స్’ కూడా ఒకటి.

ఈ మూవీకి చిదంబరం దర్శకత్వం వహించగా, పరవ ఫిలింస్ బ్యానర్ పై సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. అదేవిధంగా సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాన్ లాల్, దీపక్ పరంబోల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ.. తమిళనాడులోని కొడైకెనాల్ కి కొందరు ఫ్రెండ్స్ వెకేషన్ కు వెళ్ళినప్పుడు ఆ గ్రూపులో ఓ స్నేహితుడు గుణ గుహలలో పడిపోతాడు. అతన్ని కాపాడేందుకు ఇతర స్నేహితులు చేసే ప్రయత్నాల చుట్టే ఈ స్టోరీ నడుస్తుంది.

తాజాగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గత అర్ధరాత్రి నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం ఇండస్ట్రీలో రూ. 200 కోట్ల కలెక్షన్లు రాబట్టిన తొలి చిత్రం మంజుమ్మల్ బాయ్స్ కావడం విశేషం.

Next Story

Most Viewed