మంచు విష్ణు బర్త్ డే స్పెషల్ ‘కన్నప్ప’ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్

by Hamsa |   ( Updated:2023-11-24 11:29:51.0  )
మంచు విష్ణు బర్త్ డే స్పెషల్ ‘కన్నప్ప’ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే ఇటీవల మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ ప్రారంభం అయిందని ప్రకటించారు. దీనిని మోహన్ బాబు దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మధుబాల, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, ప్రభాస్, నయనతార లాంటి స్టార్స్ నటిస్తున్నారు. నేడు మంచు విష్ణు పుట్టినరోజు కావడంతో మేకర్స్ అభిమానులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.

కన్నప్ప నుంచి విష్ణు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కన్నప్పగా విష్ణు ఎలా కనిపించబోతోన్నాడో క్లియర్‌గా అయితే చూపించలేదు. కానీ విష్ణు పాత్ర ఎలా ఉండబోతోందో చెప్పేలా ఓ పోస్టర్‌ను వదిలారు. బర్త్ డే స్పెషల్‌గా వదిలిన ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం సినిమా మీద ఫుల్ పాజిటివ్ ఇమేజ్ వచ్చేలా ఉంది. సినిమా షూటింగ్ అంతా కూడా న్యూజిలాండ్‌లోనే జరగనుంది. టీం అంతా కూడా ఇప్పుడు అక్కడే ఉందని సమాచారం. కాగా, కన్నప్ప పాన్ ఇండియా సినిమాగా థియేటర్స్‌‌లోకి రానుంది. దీంతో మంచు విష్ణు పోస్టర్‌ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది అస్సలు ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story