- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kannappa: ఆ పాత్రలో కనిపించబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. సిద్ధంగా ఉండండి అంటూ మంచు విష్ణు పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నాడు. అలాగే ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార, మధుబాల వంటి స్టార్స్ ఇందులో భాగమయ్యారు. ఇప్పటికే కన్నప్ప సినిమా షూటింగ్ పలుచోట్ల జరిగిన విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుండటంతో అందరి చూపు కన్నప్ప పైనే పడింది.
ఇదిలా ఉంటే.. తాజాగా, కన్నప్ప సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ను మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘‘సూపర్ స్టార్ మిస్టర్ అక్షయ్ కుమార్‌ని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు స్వాగతిస్తున్నందున కన్నప్ప ప్రయాణం మరింత ఉత్కంఠ భరితంగా మారింది. కన్నప్పతో తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేసినందుకు థ్రిల్‌గా ఉంది. మరపురాని సాహసానికి సిద్ధంగా ఉండండి!’’ అంటూ అక్షయ్ కుమార్ సెట్‌కు వచ్చిన వీడియోను షేర్ చేశాడు. అయితే ఇందులో శివుడి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. కల్కిలో ప్రభాస్ శ్రీవిష్ణువుగా కనిపించబోతున్న క్రమంలో.. కన్నప్ప లో శివుడి పాత్ర నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. దీంతో ఆ క్యారెక్టర్‌లో అక్షయ్ కుమార్ అయితే బాగుంటుందని భావించి ఆయనను తీసుకున్నట్లు టాక్.