- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
సర్దార్ 2 కోసం కష్టపడుతున్న మాళవిక.. స్టంట్ ఫొటోలు వైరల్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. తాజాగా షేర్ చేసి పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ మేరకు ‘‘సర్దార్ 2’ కోసం కొన్ని కష్టమైన స్టంట్ సీక్వెన్స్‌లను షూట్ చేశాము. అవి చేసేటప్పుడు మా కాస్ట్యూమ్ ఎలా ఉంటుందో మీకు చూపించాలి అనుకున్నాను. మనం ఎత్తు నుంచి దూకినప్పుడు/గాలిలో తేలుతున్నప్పుడు లేదా నిజంగా ఎత్తైన కిక్ చేయడానికి పైకి లేచినప్పుడు రోప్స్ సాయంతో మమ్మల్ని గట్టిగా పట్టుకోడానికి ఇవి ఉపయోగపడతాయి. తంగలాన్ సినిమా కోసం మొదటి సారి నేను రోప్ వర్క్స్ చేశాను. అప్పుడు కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రాక్టీస్‌తో బాగా చేస్తున్నాను. కొన్ని సీన్స్‌లో మాత్రం బాగా కష్టపడాల్సి వస్తుంది’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ పోస్ట్‌తో మాళవిక మోహనన్ ‘సర్దార్ 2’లో కూడా చేస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ 2’కు పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో SJ సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.