Malaika Arora :మీకు తొడలు, ఎదలే కనిపిస్తాయా? ఫొటోగ్రాఫర్లపై ఫైర్ !

by Prasanna |   ( Updated:2022-12-17 08:07:50.0  )
Malaika Arora :మీకు తొడలు, ఎదలే కనిపిస్తాయా? ఫొటోగ్రాఫర్లపై ఫైర్ !
X

దిశ, సినిమా : సెక్సీ బ్యూటీ మలైక అరోరా జర్నలిస్టుల ప్రవర్తనపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనతో పాటు సహ నటీమణులు ఎక్కడ కనిపించిన సందర్భంతో సంబంధం లేకుండా వెంటపడి ఫొటోలు తీస్తూ చిరాకు తెప్పిస్తారని మండిపడింది. అంతేకాదు తమవెంట నడుస్తూ వీడియోలు తీయడం తీవ్రమైన కోపం తెప్పిస్తారంటూ ఫైర్ అయింది. " మూవింగ్ ఇన్ విత్ మలైకా " టాక్‌ షోను హోస్ట్ చేస్తున్న నటి తాజా ఎపిసోడ్‌‌లో మాట్లాడుతూ..'నన్ను ఎవరైనా కావాలని చీట్ చేస్తే తప్పా.. నేను ఎవరినీ తిట్టను. ఫొటోలు తీసేటప్పుడు ఎద భాగంపై చేతితో చూపిస్తారు. తొంటి వైపు కిందకు కెమెరాలను పెట్టి అసభ్యంగా ప్రవర్తిస్తారు. మా ప్రమేయం లేకుండా కెమెరా అక్కడికి, ఇక్కడికి వెళుతుంటుంది. అదే నాకు పెద్ద సమస్య. నా శరీరానికి సంబంధించిన భాగాలపై ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నిస్తే.. 'చూపించకూడదనుకుంటే పూర్తి కప్పి ఉంచే బట్టలు ధరించండి అంటూ ఎదురుచెబుతుంటారు' అని తెలిపింది. అయితే తాను ఏ డ్రెస్సులు వేసుకుంటే జనాలకు ఎందుకు అని, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు బతికే హక్కు ఉందని ఈ బ్యూటీ గుర్తు చేసింది.

Also Read: మాజీ భర్తకు సపోర్టుగా నిలిచిన నటి.. తన కోసమే అది చూశానంటున్న.. దల్జీత్ కౌర్ !

Advertisement

Next Story