- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajinikanth: వెట్టైయాన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తలైవా పోస్టర్
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన లాల్ సలామ్, దర్బార్ అంతగా మెప్పించలేకపోయాయి. ప్రజెంట్ తలైవా నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయాన్’. దీనిని జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అయితే రజినీ, అమితాబ్ కలిసి నటిస్తున్న నాలుగో సినిమా ఇది. ఆయనతో పాటు మలయాళ హీరో ఫహాద్, టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు. అంతేకాకుండా రితికా సింగ్, దుషరా, మంజు వారియర్ నటిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. అయితే ఈ బ్యానర్‌లో తలైవా చేస్తోన్న నాలుగో సినిమా వెట్టైయాన్. తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ ఆగస్టు 19న రాఖీ పండుగ కావడంతో వెట్టైయాన్ అప్డేట్ విడుదల చేశారు.
ఇందులోంచి రజినీకాంత్ పోస్టర్‌ను విడుదల చేస్తూ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని కూడా ప్రకటించారు. అయితే ఈ పోస్టర్‌లో సూపర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా స్టైలిష్ లుక్‌తో అదరగొట్టాడు. అయితే వెట్టైయాన్, కోలీవుడ్ స్టార్ హీరో కంగువా అక్టోబర్ దసరా బరిలో ఉండటం విశేషం. రెండు పాన్ ఇండియా చిత్రాలు కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఓకే రోజు ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు రాబోతుండటంతో అయోమయంలో పడిపోయారు. భారీ బడ్జెట్ పిరియాడికల్ మూవీ కంగువ కూడా అక్టోబర్ 10న విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Target locked 🎯 VETTAIYAN 🕶️ is set to hunt in cinemas worldwide from OCTOBER 10th, 2024! 🗓️ Superstar 🌟 as Supercop! 🦅
— Lyca Productions (@LycaProductions) August 19, 2024
Releasing in Tamil, Telugu, Hindi & Kannada!#Vettaiyan 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran… pic.twitter.com/WJi2ZvpX8Z