జనసేన పవన్ కళ్యాణ్‌ను గెలిపించండి..రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్!

by Jakkula Mamatha |   ( Updated:2024-05-08 12:58:49.0  )
జనసేన పవన్ కళ్యాణ్‌ను గెలిపించండి..రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏర్పడిన కూటమి పార్టీలు సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో హోరెత్తిస్తున్నారు. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం సినీ నటులు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కోసం మెగా కుటుంబం ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఇది నెటిజన్లు పవర్ స్టార్ గెలుపు ఖాయమని కామెంట్స్ పెడుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురంలో ప్రచారం చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి ఈ రోజు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించండి అంటూ పోస్ట్ చేశారు. ఇది ప్రజెంట్ నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా చిరంజీవి ట్వీట్‌కి రామ్ చరణ్ స్పందిస్తూ చిరంజీవీ ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడయోని రామ్ చరణ్ ట్వీట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్‌ని గెలిపించండి అని పోస్ట్ చేశాడు. ఈ ఎన్నికల్లో జనసేనతో అంటూ పవన్‌కు మద్దతుగా జనసేనానిని గెలిపించండి అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.‘మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి’ అని పోస్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ జనసేనాని గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు . ప్రజెంట్ ఆయన చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement

Next Story