సినిమా నా డీఎన్‌ఏలో ఒక భాగం.. సితార పోస్ట్ వైరల్

by Anjali |   ( Updated:2023-10-13 11:05:07.0  )
సినిమా నా డీఎన్‌ఏలో ఒక భాగం.. సితార పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: మహేష్ బాబు కూతురు సితార మరోసారి ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో అభిమానులను అలరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్ కిడ్.. తాజాగా ఇన్‌స్టా వేదిగా సినీ పరిశ్రమపై తనకున్న అభిమతాన్ని చాటుకుంది. ‘చిత్ర పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. నా లైఫ్‌లో సినిమా అనే పదానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నా దృష్టిలో ఇది కేవలం ఇండస్ట్రీ మాత్రమే కాదు.. నా డీఎన్‌ఏలో ఒక భాగం. ప్రపంచవ్యాప్తంగా గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మా తాతగారు ఈ రంగంలో మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశారు. నిజంగా ఆయన వారసత్వంలో భాగమైనందుకు ఎంతో గర్వపడుతున్నా. మా నాన్న తన తండ్రి నుంచి ఎలాగైతే స్ఫూర్తి పొందారో.. నేను నా తండ్రి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆమె.. తనకు నటి కావాలనే కోరిక ఉందని, అవకాశం దొరికితే భవిష్యత్తులో తప్పకుండా వెండితెరపై రాణిస్తానని చెప్పింది.


Advertisement

Next Story