Superstar Krishna : తండ్రిని తలుచుకుంటూ.. Mahesh Babu (మహేశ్ ‌బాబు) ఎమోషనల్ పోస్ట్

by sudharani |   ( Updated:2022-12-15 07:11:47.0  )
Superstar Krishna : తండ్రిని తలుచుకుంటూ.. Mahesh Babu (మహేశ్ ‌బాబు) ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ ఈ నెల 15 న మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో, అభిమానుల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఒకే సంవత్సరంలో అన్నను, అమ్మను.. తాజాగా నాన్నను పొగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు. ఈ క్రమంలోనే తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

''మీ జీవితం ఎంతో గొప్పగా సాగింది. మీరు స్వర్గస్తులవ్వడాన్ని ఇంకా ఘనంగా జరుపుకుంటున్నారు. అది మీ గొప్పతనం. మీరు మీ జీవితంలో భయం లేకుండా జీవించారు. డేరింగ్ అండ్ డాషింగ్ మీ వ్యక్తిత్వం. మీరే నా ఆదర్శం, నా ధైర్యం.. మీతో నేను నేర్చుకున్నవన్నీ చాలా ముఖ్యమైనవి.. అవన్నీ మీతో పాటే వెళ్లిపోయాయి. కానీ, విచిత్రం ఏంటంటే.. గతంలో ఎన్నడూ లేని విధంగా నాలో శక్తిని, అనుభూతిని పొందుతున్నాను. ఇప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను. మీరు వెలిగించిన ఆత్మవిశ్వాస జ్యోతి నాలో ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం నాలో ఎలాంటి భయాలు లేవు. మీ దీవెనలతో మరింత ముందుకు వెళ్తాను. మిమ్మల్ని మరింతగా గర్వపడేలా చేస్తాను. నాన్న, మై సూపర్ స్టార్.'' హార్ట్ ఫెల్ట్ నోట్‌తో పాటు సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించి యంగ్ ఫొటోగ్రాఫ్‌ను కూడా మహేశ్ పంచుకున్నారు.

బ్లాక్ 'బ్రా' నుంచి ఎగిసిపడుతున్న అందాలు.. కుర్రాళ్లకు తడిసిపోయిందట

Next Story

Most Viewed