ఘట్టమనేని గారాల పట్టి అల్లరి చూసి మురిసిపోతున్న ప్రిన్స్.. ఫోటో వైరల్

by Anjali |   ( Updated:2023-06-18 15:58:37.0  )
ఘట్టమనేని గారాల పట్టి అల్లరి చూసి మురిసిపోతున్న ప్రిన్స్.. ఫోటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితారా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సితారా పాప.. డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తూ ఉంటుంది. తాజాగా.. ఇవాళ(జూన్ 18) ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి మహేశ్ బాబుకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ చెప్పింది. ఈ సందర్భంగా కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసింది. ‘నా సూపర్ డాడ్ నా చీర్ లీడర్. మా నాన్నకి ఫాథర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ ఫొటోల్లో మహేష్ బాబు, సితార ఒకరిని ఒకరు హగ్ చేసుకుని తమ సమయాన్ని హ్యాపీగా గడుపుతున్నారు. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్‌తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

పవన్ కల్యాణ్కు ప్రాణహాని.. కేఏ పాల్కు ముందే తెలుసా?

Advertisement

Next Story