SITARA-NAVYASRI: పుట్టిన రోజున గొప్పమనసు చాటుకున్న సితార.. ఏం చేసిందో తెలిస్తే చేతులెత్తి దండం పెడతారు

by Anjali |
SITARA-NAVYASRI: పుట్టిన రోజున గొప్పమనసు చాటుకున్న సితార.. ఏం చేసిందో తెలిస్తే చేతులెత్తి దండం పెడతారు
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు డాటర్ సితార గురించి సుపరిచితమే. మొన్న (జులై 20) సితార పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా సితార తల్లిదండ్రులైన సూపర్ స్టార్ అండ్ నమ్రతతో పాటు ప్రిన్స్ అభిమానులు సోషల్ మీడియా వేదికన పుట్టిన రోజు శుభాకాంక్షల వర్షం కురిపించారు. అయితే బర్త్ డే సందర్భంగా సితార గొప్ప మనసు చాటుకుని నెట్టింట ప్రశంసలు అందుకుంటుంది. తండ్రికి తగ్గ తనయ అని సితారను కొనియాడుతున్నారు. ఇకపోతే మహేష్ బాబు గారాల పట్టి ఏం చేసిందంటే..

దినసూరి కూలీ అయిన నవ్య శ్రీ అనే అమ్మాయికి మెడిసిన్ చదవాలనే ఆశ ఉంది. కానీ చదివే స్తోమత లేదు. నీట్ ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించిన నవ్యకు సితార.. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా 1,25,000 రూపాయల చెక్ నవ్యశ్రీకి అందజేసింది. అంతేకాకుండా స్టెతస్కోప్, ల్యాప్ టాప్ కూడా బహుబతిగా ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలోని జనాలు సితారను పొగడక తప్పడం లేదు. చిన్న వయసులో ఇంత గొప్ప మనసు చాటుకుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story