- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Dulquer Salmaan: లక్కీ చాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఈ సారి రొమాన్స్ ఎవరితో చేయనుందంటే?
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ అమ్మడు యూత్ హృదయాలను కొల్లగొట్టి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తన అందం, అభినయం, నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా, భాగ్యశ్రీ బోర్సే మరో లక్కీ చాన్స్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ సరసన ‘కాంత’ సినిమాలో ఈ అమ్మడు ఆఫర్ దక్కించుకుంది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో భాగ్యశ్రీ బోర్సే పాల్గొంది.
ప్రజెంట్ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో రానా, దుల్కర్, భాగ్య శ్రీ బోర్సే ఉన్న పిక్ ఆకట్టుకుంటోంది. కాగా నీలా ఫేమ్ సెల్వమణి డైరెక్షన్‌లో వస్తున్న కాంత మూవీలో దుల్కర్ హీరోగా నటిస్తుండగా.. రానా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయగా.. మంచి రెస్సాన్స్‌ను దక్కించుకుంది. దీనిని వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ తొందరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. మునుపెన్నడూ లేని విధంగా కాంత ఉండబోతున్నట్లు తెలుస్తోంది.