డబ్బు ఉందని విర్రవీగుతున్న నాగార్జున.. పాపం తోటి నటుడిని అంత ఘోరంగా అవమానించాడా?

by Dishafeatures3 |
డబ్బు ఉందని విర్రవీగుతున్న నాగార్జున.. పాపం తోటి నటుడిని అంత  ఘోరంగా అవమానించాడా?
X

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున, ధనుష్ హీరోలుగా వస్తున్న మల్టీ స్టారర్ మూవీ 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. కింగ్ డబ్బున్న బడా వ్యక్తిలా రిచ్ గా కనిపిస్తే.. ధనుష్ చిరిగిపోయిన దుస్తులతో బీదవాడిగా నటిస్తున్నట్లు అనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ టీజర్ త్వరలోనే రానుండగా.. స్టోరీ లైన్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది.

డబ్బు ఉందని విర్రవీగుతున్న నాగార్జున.. నోటు కింద పడితే వదిలేసే టైప్. కాగా ఒక్క పూట అన్నం కోసం పరితపిస్తూ.. దేవుడి దిక్కు చూసే వ్యక్తి ధనుష్. ఈ క్రమంలో కింగ్ అతన్ని కలవడం, దారుణంగా అవమానించడంతో.. ధనుష్ కుబేరుడిగా మారేందుకు ప్రయత్నిస్తాడు. బోలెడు డబ్బు సంపాదిస్తాడు. అదే టైంలో నాగార్జునకు మనీ అవసరం ఉండగా.. ఆయన మాదిరిగా అవమానించకుండా వెంటనే ఇచ్చేస్తాడు. డబ్బు విలువ తెలిసిన వ్యక్తిగా ప్రసంశలు అందుకుంటాడు. మొత్తానికి ఇందులో నాగ్ నెగెటివ్ షేడ్ లో సరికొత్తగా కనిపిస్తాడని టాక్. కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు నెటిజన్లు. శేఖర్ కమ్ముల కొత్తగా ట్రై చేస్తున్నాడని.. బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్తున్నారు.

Next Story