ఆ క్యారెక్టర్ నన్ను భావోద్వేగానికి గురిచేసింది.. చాలా ఏడ్చేశా

by Prasanna |   ( Updated:2023-05-12 06:49:35.0  )
ఆ క్యారెక్టర్ నన్ను భావోద్వేగానికి గురిచేసింది.. చాలా ఏడ్చేశా
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్‌లో మనసుకు దగ్గరైన పాత్ర గురించి ఓపెన్ అయింది. మొదటి చిత్రం ‘ఉప్పెన’తోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ఆమె నాగచైతన్య సరసన నటించిన ‘బంగార్రాజు’లోని నాగలక్ష్మీ పాత్ర భావోద్వేగానికి గురిచేసిందని చెప్పింది. తాను ఇంతవరకూ ఆ క్యారెక్టర్‌లో పొందిన అనుభూతి ఎప్పుడూ పొందలేదని, షూటింగ్ పూర్తైన తర్వాత దర్శకుడు కల్యాణ్ కృష్ణకు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడుతూ తెలియకుండానే ఏడ్చానని తెలిపింది. ఇక తన రాబోయే మూవీ ‘కస్టడీ’లోనూ తను పోషించిన పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నటి.. అన్ని సినిమాలకు ఒకే విధంగా కష్టపడతానని, విజయం కోసం ఆలోచించకుండా వందశాతం పనిలోనే నిమగ్నమైపోతానని పేర్కొంది. చివరగా తనకు రాజకుమారి తరహా పాత్రలు చేయాలని ఉందన్న కృతి.. అదే తన డ్రీమ్ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.

Also Read.

కామపు కళ్లతో చూడొద్దు.. నటి పోస్ట్ వైరల్

Advertisement

Next Story